మేడ్చల్ నియోజక వర్గాన్ని కూడా తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లాగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న  హామీ ఇచ్చారు. ఈ రోజు దానికి సంబంధించిన మొదటి జివొ విడుదలయింది.

రాజు తల్చుకుంటే ఏమవుతుంది. ఎం కెసిఆర్ తల్చుకున్నారు. 24 గంటలు తిరక్కముందే జివొ వచ్చింది.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చినట్లు ఒక జివొ 24 గంటల్లో విడుదలయింది. మేడ్చల్ నియోజకవర్గంలోని కేశవాపూర్, లక్ష్మా పూర్ గ్రామాల ప్రజలు కోరినవన్నీ సమకూర్చేందుకు ఈ రోజ తెలంగాణా ప్రణాళికా విభాగం నిధులు ఖర్చు చేసేందుకు అవసరమయిన ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ రెండు గ్రామాల గ్రామసభ సమావేశాలలకు హజరయ్యారు. అపుడు అక్కడి ప్రజలు పలు డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుంచారు. వీటిని తీర్చేందుకు కేశవాపూర్ కి 12.26 కోట్లు, లక్ష్మాపూర్ కి 15.50కోట్ల నిధులు కావాలి. 24 గంటలలో ఇక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించిన జివొ విడుదలచేయిస్తానని చెప్పారు. అన్నట్లుగానే ఈ మధ్యాహ్నం ప్రణాళిక శాఖ రెండు గ్రామాలకు కలిపి రు.27.76 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

 ఈ రెండు గ్రామాలు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకివస్తాయి. మేడ్చల్ ను ఆయన తన నియోజకవర్గం గజ్వేల్ లాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.