తెలంగాణ అమరవీరుల స్థూపం డిజైన్ రెడి

kCR endorses designs of telangana martyrs memorial
Highlights

హుసేన్ సాగర్ ఒడ్డున రానున్న తెలంగాణ అమరవీరుల స్థూపం

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వందలాది అమరవీరుల కోసం ఒక స్మారక స్థూపాన్ని తెలంగాణ  ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇది హుసేన్ సాగర్ సమీపంలో వస్తున్నది. దీనికి సంబంధించిన నమూనాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  ఆమోదించారు. ఈ నమూనాలను ఐటి మంత్రి కెటి రామారావు ట్వీట్ చేశారు. స్మారకనిర్మాణం దీపాకారంలో ఉంటుంది. అమరులకు నిరంతరం నివాళి అర్పిస్తున్నట్లుగా దీపం వెలుగుతూ ఉంటుంది. అమరువీరుల స్మారకాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తారు. ఆ స్మారకం దగ్గర మ్యూజియం, ఆడియో విజువల్ ఏర్పాట్లు,  కోసం కన్వెన్షన్ హాల్ తో  పాటు ఒక రెస్టారెంట్ కూడా ఉంటాయి. స్మారక మందిరంలో మొత్తం మూడు అంతస్తులుంటాయి.

 

loader