పెండింగులో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులు మరొక మారు సమావేశం అవుతున్నారు. గవర్నర్ ను ఉపరాష్ట్రపతిగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపాదించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నపుడు ఈ సమావేశం జరుగుతూ ఉండటం విశేషం.

పెండింగులో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఃఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు మరొక మారు సమావేశం అవుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. లోపల ఇంకేదో రాజకీయ సమస్య కూడా చర్చకు రావచ్చని కూడా వినపడుతూ ఉంది.

గవర్నర్ ను ఉపరాష్ట్రపతిగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపాదించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నపుడు ఈ సమావేశం జరగుతూ ఉండటం విశేషం. 

కాబట్టి ఇది కూడా చర్చనీయాంశమని, సమావేశం తర్వాత దీని మీద స్పష్టత వస్తుందని కూడా తెలిసింది.

ఎందుకంటే, విభజన సమస్యలేమంతా జటిలమయినవికాదు, కాకపోతే, విభజన ప్రాసెస్ పూర్తయేందుకు సమయం తీసుకోవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయి అర్జంటుగా డిసైడ్ చేయాల్సిన విషయాలేవీ లేవు. పెండింగులో ఉన్న వాటి వల్ల పరిపాలనేమీ కుంటుబడటంలేదు,. అందువల్ల ఇది రాజకీయ సమావేశమనే వాదన కూడా వినబడుతూ ఉంది.

గవర్నర్ నరసింహన్ సమక్షంలో సోమవారం రాజ్ భవన్ లో ఈ సమావేశం జరుగనుందని తెలిసింది. అయితే, అధికారిక ప్రకటన వెలువడ లేదు.

అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్ చొరవ తీసుకుంటున్నారు. కేంద్ర సూచనల మేరకు గవర్నర్ నరసింహన్ ఈ సమావేశం ఏర్పాటుచేస్తున్నారని తెలిసింది.

ఏపీ సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడం, హై కోర్టు విభజన తదితర అంశాలపై ఇరువురు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అలాగే విద్యుత్, సచివాలయ ఉద్యోగుల విభజన, అస్తుల పంపకంకూడా అజండా లో ఉన్నాయని చెబుతున్నారు.

ఈ అంశాల మీద గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో గతంలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఇప్పటి వరకు మూడుసార్లు సమావేశమయ్యారు.

చర్చల కొనసాగింపుగా ఆ పైన గవర్నర్ మంత్రులతో సమావేశాలు జరిపారు.తర్వాత దీని మీద ముఖ్యమంత్రులకు నివేదికలందాయి.

వీటి మీద ఒక నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబులతో గవర్నర్ సమావేశమవుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి.