పవన్ మీద చురకలేసిన కత్తి మహేశ్

పవన్ మీద చురకలేసిన కత్తి మహేశ్

‘‘నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!’’  ఈ మాట  అనింది ఎవరి నుద్దేశించో వేరేచె ప్పనవసరం లేదు. అన్నది మాత్రం కత్తి మహేశ్. నిన్నటి నుంచి ఉత్తరాంధ్ర, పోలవరంలలో పర్యటిస్తున్నజనసేన  అధిపతి పవన్ కల్యాణ్ మీద చాకులాంటి వ్యాఖ్యలేశాడు కత్తి మహేశ్. ఈ వ్యాఖ్యలను ఆయన ఫేస్ బుక్ అకౌంటులో పోస్టు చేశారు. సినిమా ఫీల్డ్  పవన్ కల్యాణ్ కు ఉన్న స్ట్రాంగ్ క్రిటిక్స్ లలో కత్తి ఒకరు. రామ్ గోపాల్ వర్మ లాగా  కత్తి కూడా  పదునైన మాటలతో పొడుస్తూ ఉంటాడు.ఆయన  ఇంకా ఏమన్నాడో చూడండి

కత్తి ఈ మధ్య చాలా పదునెక్కాడు. ఆయన విమర్శలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ‘అవతలి వ్యక్తి ఎవరన్నది నాకనవసరం, నా అభిప్రాయం నేను చెప్పేస్తా’ననే ధోరణి కనిపిస్తూ ఉంది. ఇలాంటి ధోరణి సినీరంగంలో చాలా తక్కువ. దానికి బాగా ధైర్యం ఉండాలి. ఎందుకంటే మోనాపలి వేళ్లూనికున్న సినరంగంలో  అందరిని తెగుపొగుడుతూ, అనందపరుస్తూ ఉంటేనే అక్కడ బతుకుతారు. లేదా రామ్ గోపాల్ వర్మలాగా మావెరిక్ గా ఉండాలి. మొన్న పోలవరం వివాదం వచ్చినపుడు  ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా మహేశ్ కత్తి దూశాడు. పోలవరం మీద చంద్రబాబు  ఇంతవరకు చెప్పినవన్నీ అబద్దాలన్నమాట అన్నారు.  కాపు రిజర్వేషన్ల మీద ఆయన బాబుని వదల్లేదు, ఇలా...

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos