Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రే వాకౌట్ చేశారక్కడ...

మంత్రుల మీద అలిగి  ఈ ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

kashmir CM walks out of cabinet meeting

ఇదిగో ఇదెక్కడా జరిగి ఉండదు. 

 

కశ్మీర్ లో జరిగింది.

మంత్రుల మీద అలిగి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి  బురబురా క్యాబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆమె అలిగింది తన క్యాబినెట్ లో ఉన్న బిజెపి మంత్రుల మీద. ఈ సంఘటన కొద్ది సేపటి కిందట జరిగింది. 

 

ముఖ్యమంత్రి సాధారణంగా మంత్రులను చివాట్లు పెట్టడం జరగుతుంది. క్యాబినెట్ లో ముఖ్యమంత్రి చెప్పిందానికి ఎదురుండదు. ఎవరైనమంత్రి క్యాబినెట్ లో ఎదరుతిరిగితే ముఖ్యమంత్రి ఆయనను మంత్రివర్గం నుంచి పెరికి అవతల పడేయవచ్చు. అయితే,ఇక్కడ తారుమారయింది కథ.   బిజెపితో చేతులు కలిపి ఏర్పాటుచేసిన ప్రభుత్వం కాబట్టి ఇష్టానుసారం మంత్రులను పెరికేయడం కుదరదు. అందుకే ఆమె విస విసా వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

 

బిజెపి మంత్రులకు అమె కు గొడవ కారణం  కశ్మీర్ పోలీస్ సర్వీస్ ను పునర్వ్యవస్థీకరించే విషయం.


రాష్ట్ర పోలీస్ సర్వీస్ ను పునర్వ్యవస్థీకరించాలన్నది మెహబూబా ప్రతిపాదన.దీనికి ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా బీజేపీ మంత్రులంతా ‘నో ’ అనేశారు.దీనితో మేడమ్ మెహబూబా ముఫ్తీ ఎక్కడ లేని కోపం వచ్చింది. ఒక్క ఉదుటన లేచి, క్యాబినెట్ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

 

 ఈ వివాదం ముదరకుండా వుండేందుకు గొడవ బీజేపీ మంత్రులు పరిగెత్తుకుంటూ సీఎం నివాసానికి హుటాహుటిన వెళ్లారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ మెహబూబా బిజెపితో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios