ఆస్పత్రిలో సినిమాలు చూస్తున్న కరుణ
శ్వాసకోస ఇబ్బందులతో కావేరీ ఆస్పత్రిలో చేరిన డీఎంకే దళపతి కరుణానిధి ఇప్పుడు అక్కడ తాపీగా సినిమాలు చూస్తున్నారట.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని డాక్టర్లు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో కరుణ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.
కాగా, ఆస్పత్రిలోని ఐసీయూలో ఉన్న కరుణానిధి... రజినీకాంత్ సూపర్ హిట్ మూవీ భాషాను చూస్తున్నట్లు డీఎంకే చానెల్ కళైంజర్ పేర్కొంది.
శ్వాస కోసం ఇబ్బందులు తలెత్తడంతో గత శుక్రవారం రాత్రి ఆయనను కావేరీ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే.
