కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప విజయం సాధించారు.

బెంగళూరు: కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప విజయం సాధించారు. ఆయన శికారిపుర నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలిచారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బిజెపి ఖాతాలో 21వ రాష్ట్రం చేరింది. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు బిజెపి అధిష్టానం భేటీ కానుంది. 

కాంగ్రెసు నేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాదామి నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి బి. శ్రీరాములుపై 3 వేలకు పైగా ఆధిక్యంలో ఉండగా, చాముండేశ్వరి నగర్ లో బిజెపి అభ్యర్థి గోపాలరావుపై 12 వేలకు పైగా వెనకంజలో ఉన్నారు.

వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ఆధిక్యంలో ఉన్నారు.