సోనియా ఫోన్: కుమారస్వామికి బంపర్ ఆఫర్

సోనియా ఫోన్: కుమారస్వామికి బంపర్ ఆఫర్

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ట్రెండ్స్ మారడంతో కాంగ్రెసు పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. వారు చురుగ్గా కదులుతున్నారు. బిజెపిని అడ్డుకోవడానికి వ్యూహరచన చేసి, అమలు చేయడానికి సిద్ధపడ్డారు. 

జెడిఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశపెడుతున్నారు. ఆజాద్, అశోక్ గెహ్లాట్ జెడిఎస్ నేత కుమారస్వామితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

బిజెపి మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుందని భావించిన తరుణంలో ఫలితాలు బెడిసికొడుతున్నాయి. అధికారంలోకి రావడానికి 112 సీట్లు అవసరం కాగా, బిజెపి 104 సీట్ల వద్ద ఆగిపోయినట్లు కనిపిస్తోంది.

కాంగ్రెసు 78 సీట్ల వద్ద, జెడిఎస్ 38 సీట్ల వద్ద ఆగిపోయాయి. ఈ రెండు పార్టీలు కలిపితే మెజారిటీ సాధించడానికి వీలువుతుంది. ఈ తరుణంలో అశోక్ గెహ్లాట్, ఆజాద్ జెడిఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. జెడిఎస్ కు బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెసు సిద్ధపడుతోంది.

కుమారస్వామికి కాంగ్రెసు నేత సోనియా గాంధీ పోన్ చేశారు. బిజెపి ఆశలపై నీళ్లు చల్లేందుకు కాంగ్రెసు సిద్ధపడినట్లు కనిపిస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos