బెంగళూరు: కర్ణాటకలో బిజెపిని అడ్డుకోవడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిఎస్పీ నేత మాయావతి కూడా రంగంలోకి దిగారు. బిజెపిని అడ్డుకోవాలనే కాంగ్రెసు ఫార్ములాకు వారిద్దరు మద్దతు ఇచ్చారు. 

మమతా బెనర్జీతో పాటు మాయావతి జెడిఎస్ అధినేత దేవెగౌడకు ఫోన్ చేసి, కాంగ్రెసుతో కలిసి నడవాలని సూచించారు. బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని జెడిఎస్ కూడా ప్రకటించింది. 

కర్ణాటకలో కాంగ్రెసు, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఒప్పందానికి తుది రూపం వచ్చింది. కాగా, రాజభవన్ కు వెళ్లిన కాంగ్రెసు నేతలకు చుక్కెదరైంది. కాంగ్రెసు నాయకులను కలవడానికి గవర్నర్ నిరాకరించారు. 

కాగా, కర్ణాటకలో పాలువు కదపడానికి బిజెపి ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నట్లే ఉంది. బిజెపి అగ్రనేతలు ఆగమేఘాల మీద బెంగుళూరుకి బయలుదేరారు. కాగా, స్వతంత్రులు కూడా తమ మద్దతు ఇస్తారని జెడిఎస్ చెప్పింది. కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.