ముఖ్యమంత్రిగా రేపే యడ్యూరప్ప ప్రమాణస్వీకారం?

Karnataka: Yeddyurappa may swear-in as cm
Highlights

బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు: బిజెపి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేపు గురువారం ఉదయం 11.30 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి అందుకు ఏర్పాట్లు కూడా చేస్తంోదంి.

బుధవారం ఉదయం ఆయనను బిజెపి ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన బిజెపి నేతలతో కలిసి గవర్నర్ ను కలిసేందుకు బయలుదేరారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. 

జెపి నడ్డా, ప్రకాశ్ జవదేకర్, సదానంద గౌడ తదితలు యడ్యూరప్పతో పాటు ఉన్నారు. కాగా, జెడిఎస్ మద్దతు తీసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. 

ఇదిలావుంటే, తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెసు, జెడిఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

loader