కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ ప్రధాని, జెడిఎస్ నేత దేవెగౌడకు ఫోన్ చేసి మాట్లాడారు.

న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ ప్రధాని, జెడిఎస్ నేత దేవెగౌడకు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వారిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ఈ సంభాషణ వివరాలు బయటకు రాలేదు. 

బిజెపి శాసనసభా పక్ష నేత బిఎస్ యడ్యూరప్పతో గవర్నర్ వాజుభాయ్ వాలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. 

బలనిరూపణకు యడ్యూరప్పకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం వల్ల కాంగ్రెసు, జెడిఎస్ అగ్రనేతలకు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పరీక్షగా మారింది.

ఆ రెండు పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను హైదరాబాదు తరలిస్తున్నాయి. ఇంత వరకు వారు కర్ణాటకలోని లగ్జరీ రిసార్టుల్లో ఉన్నారు.