అమరావతి: కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది. రేపు శనివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆ నిర్ణయం వెలువడింది. ఈ స్థానానికి మే 28వ తేదీన లేదా 31వ తేదీన పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. 

రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) నియోజకవర్గంలోని ఓ అపార్టుమెంటులో దాదాపు వేయి నకిలీ ఓటరు కార్డులు లభించిన విషయం తెలిసిందే. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్టుమెంటులో అవి బయపడ్డాయి. 

ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశారు. దాంతో రాజరాజేశ్వరినగర్ పోలింగును ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఆ అపార్టుమెంట్ కాంగ్రెసు ప్రజాప్రతినిధిది అని బిజెపి విమర్శిస్తోంది. 

ఆ అపార్టుమెంటు స్థానిక బిజెపి నేతదని, తప్పుడు సాక్ష్యం సృష్టించి బిజెపి నాటకం ఆడుతోందని కాంగ్రెసు ఎదురు దాడికి దిగింది.