టెన్షన్ పెడుతున్న కన్నడ ఫలితాలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల సరళి మారుతున్నట్లు కనబడుతున్నది. ఉదయం బిజెపి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఖాయమన్న ట్రెండ్ వచ్చింది. కానీ ఒక్కో నియోజకవర్గంలో ఫలితాలు వెలువడుతుంటే ఆ ట్రెండ్ మారుతున్న పరిస్థితి నెలకింది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లో బిజెపి 114 వరకు స్థానాల్లో గెలుస్తుందని లెక్కలు వచ్చాయి. కానీ మెల్లమెల్లగా ఆ సంఖ్య 105 దగ్గర నిలిచిపోయే అవకాశాలున్నట్లు తేలుతున్నది. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ 60 అటు ఇటూ ఉంటే 75 వరకు లాగే చాన్స్ కనబడుతున్నది. జెడిఎస్ మాత్రం 40 కంటే తక్కువకు పడిపోయింది. గతంలో వచ్చిన స్థానాలు అయినా జెడిఎస్ కు వస్తయా రావా అన్న చర్చ ఉంది.

అయితే బిజెపి మేజిక్ ఫిగర్ కు 7 సీట్ల దూరంలో నిలిచిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగుతాయా మారతాయా అన్నది సాయంత్రం వరకు కానీ తేలే అవకాశం ఉంది.

ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఒకవేళ రేపు వారి మద్దతు బిజెపి తీసుకుంటుందనుకున్నా? మరో ఐదుగురు సభ్యుల బలం బిజెపికి కావాలి. మరి ఏరకమైన వ్యవహారం నడుస్తుందన్నది తేలాల్సి ఉంది. పార్టీల ఫిరాయింపులు కూడా జరిగే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ బిజెపి సర్కారు ఫాం చేయాలనుకుంటే ఇటు కాంగ్రెస్ కానీ, అటు జెడిఎస్ నుంచి కానీ సభ్యులు పార్టీ ఫిరాయించే చాన్స్ కూడా లేకపోలేదన్న ప్రచారం సాగుతోంది.