బెంగళూరు: మాజీ ప్రధాని, జెడిఎస్ నేత దేవెగౌడ్ హసన్ జిల్లాలోని హోలెనరాసిపుర పట్టణంలోని 244 నెంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

జెడిఎస్ నేత హెచ్ డి కుమారస్వామి జయనగర్ లోని శ్రీ ఆదించుచునగిరి మహాసంస్థానానికి చెందిన నిర్మలానందనాథ మహాస్వామి దర్శించుకున్ారు. 

బిజెపి ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరు కోరమంగళలోని కర్ణాటక రెడ్డిజన సంఘంలో ఓటు వేశారు. బళ్లారిలో తన ఓటు హక్కును వినియేగించుకోవడానికి ముందు బిజెపి బాదామి నియోజకవర్గం అభ్యర్థి బి. శ్రీరాములు గోపూజ నిర్వహించారు. 

కర్ణాటకలో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం చెబుతోంది. ఈ స్థితిలో త్వరగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఢప్తులు చేస్తున్నారు.