కర్ణాటకలో ముగిసిన పోలింగ్: ఈవిఎంల్లో నేతల భవిష్యత్తు

Karnataka polls 2018: Re-polling in Hebbal booth no 2 after EVM failure
Highlights

కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. 

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 222 స్థానాలకు పోలింగ్ జరిగింది. 

బిజెపి అభ్యర్థి మృతి వల్ల జయనగర్ ఎన్నిక వాయిదా పడగా, నకిలీ ఓటరు ఐడి కార్డుల మూలంగా రాజరాజేశ్వరినగర్ పోలింగ్ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది. చెదురు మొదరు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 

నేతల భవిష్యత్తు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఈ నెల 15వ తేదీన ఓట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 17వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చెప్పగా, ఆయనకు మతిభ్రమించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. 


సాయంత్రం 5 గంటల వరకు 61.25 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, హెబ్బాల్ నియోజకవర్గంలోని నెంబర్ 2 పోలింగ్ స్టేషథన్ లో రీపోలింగ్ జరుగుతుంది. ఈవిఎంలు పనిచేయకపోవడం రీపోలింగ్ అవసరమైంది.

బెంగళూరులోని హంపీనగర్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో బిజెపి, కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తించడానికి బుర్ఖాను తీసేయడానికి నిరాకరించడంతో ో మహిళను బెలగావిలోని పోలింగ్ బూత్ లోకి అనుతించలేదు.

శిమోగాలో 150వ నెంబర్ బూత్ లో ఓటు వేయడానికి వీల్ చైర్లో  వచ్చింది. సిర్సీలో ఓటు వేయడానికి కేంద్ర మంత్రి అనంతకుమార్ క్యూలో నించున్నారు. పెళ్లికి ముందు ఓ యువతి మడకెరిలో ఓటు వేసింది.

పోలింగ్ సిబ్బంది కాంగ్రెసు అభ్యర్థి వినయ్ కులకర్ణికి ఓటు వేయాలని చెబుతున్నారని ఆరోపిస్తూ కరడిగుడ్డలోని 58వ నెంబర్ కేంద్రం వద్ద బిజెపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. 

loader