కర్ణాటక బలపరీక్ష: రాజీనామాకు యడ్యూరప్ప రెడీ, 13 పేజీల ప్రసంగ పాఠం?

First Published 19, May 2018, 1:52 PM IST
Karnataka floor test: Yeddyurappa prepared to resign
Highlights

శాసనసభలో మెజారిటీ రాకుంటే ఏం చేయాలనే విషయంపై బిజెపి చర్చిస్తోంది.

బెంగళూరు: శాసనసభలో మెజారిటీ రాకుంటే ఏం చేయాలనే విషయంపై బిజెపి చర్చిస్తోంది. బిజెపి నేతలు అత్యవసరంగా సమావేశమై ఆ విషయంపై చర్చిస్తున్నారు. 

మెజారిటీ రాకుంటే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన 13 పేజీల ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

శాసనసభ సాయంత్రం 3.30 గంటల వరకు వాయిదా పడింది. మరో 22 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు సిద్ధపడాల్సి ఉంది. 

చివరి నిమిషంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు, ఓ బిజెపి ఎమ్మెల్యే శాసనసభకు గైర్హాజరయ్యారు. ఇప్పటి వరకు ప్రోటెం స్పీకర్ తో కలిసి 196 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 

loader