మిస్సింగ్ ఎమ్మెల్యేల వెనక గాలి సోమశేఖర రెడ్డి, అందుకే గైర్హాజరు

Karnataka floor test: Both 'missing' Cong MLAs leave hotel
Highlights

కాంగ్రెసు శిబిరం నుంచి అదృశ్యమైన ఇద్దరు శాసనసభ్యుడు ఒకరు విధాన సౌధకు చేరుకున్నారు. వారిద్దరు బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నారు.

బెంగళూరు: కాంగ్రెసు శిబిరం నుంచి అదృశ్యమైన ఇద్దరు శాసనసభ్యుడు ఒకరు విధాన సౌధకు చేరుకున్నారు. వారిద్దరు బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నారు. ప్రతాప్ గౌడ పాటిల్ మాత్రం విధాన సౌధకు చేరుకున్నారు.

ప్రతాప్ గౌడ పాటిల్ వచ్చారని, ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని, ఆ తర్వాత కాంగ్రెసుకు ఓటేస్తారని, కాంగ్రెసు పార్టీని మోసం చేయరని కాంగ్రెసు నేత డికె శివకుమార్ అన్నారు. 

విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేస్తారని, ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని కూడా అన్నారు. కాంగ్రెసు శిబిరం నుంచి కనిపించకుండా పోయిన గోల్డ్ ఫించ్ హోటల్ వెలుపల కనిపించారు. 

గాలి సోమశేఖర రెడ్డి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారని తెలుస్తోంది. శనివారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి వారిద్దరితో పాటు సోమశేఖర రెడ్డి కూడా రాలేదు. 

బిజెపికి చెందిన విజయేంద్ర కాంగ్రెసు ఎమ్మెల్యే భార్యకు ఫోన్ చేసి యడ్యూరప్పకు ఓటు వేయాలని కోరారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు రూ.15 కోట్లు ఇస్తామని చెప్పినట్లు కాంగ్రెసు నేత విఎస్ ఉగ్రప్ప చెప్పారు. 

loader