దేవెగౌడ పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మొరాయింపు: ఓటేసిన యడ్యూరప్ప

దేవెగౌడ పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మొరాయింపు: ఓటేసిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించాయి. దాంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మాజీ ప్రధాని దేవెగౌడ పోలింగ్ కేంద్రంలో కూడా ఈవిఎం మొరాయించింది.  తప్పుడు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ కారణంగా హుబ్లీలోని 108వ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది.

ఓటు హక్కును వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలకు, ముఖ్యంగా యువతకు విజ్ఢప్తి చేశారు. పెద్ద యెత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని తన సోదరసోదరీమణులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

కర్ణాటకలో మొదటి సారి మహిళలు నిర్వహించే పోలింగ్ స్టేషన్లను (సఖిలను) ఏర్పాటు చేశారు. సిద్ధరామయ్య, బి. శ్రీరాములు పోటీ చేస్తున్న బాదామి నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించకోవడానికి పెద్ద యెత్తున వచ్చారు. 

కేంద్ర మంత్రి, బిజెపి నేత సదానంద గౌడ పుత్తూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ పెరుగుతుందని, సిద్ధరామయ్యను గద్దె దించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 

బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యడ్యూరప్ప శిమొగాలోని శిఖార్పూర్ లో ఓటు వేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. తాను సుపరిపాలనను అందించగలనని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos