కర్ణాటక క్రైసిస్: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్

karnataka congress tension.. two mlas missing
Highlights

టెన్షన్ లో కాంగ్రెస్ నేతలు

కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈగిల్టన్ గోల్ఫ్ రిసార్ట్ నుంచి కనిపించకుండా పోయారు. ఎలాగైనా ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుని మెజారిటీ నిరూపించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్న తరుణంలోనే ఈ ఇద్దరూ మిస్ అవ్వడం పలు సందేహాలకు తెరలేపింది. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యూటీ ఖాదర్ స్పందిస్తూ.. ‘‘అవును... ఇద్దరు ఎమ్మెల్యేలు రిసార్టులో లేరు. అయితే వాళ్లు కనిపించకుండా పోయారనడం వాస్తవం కాదు. రిసార్టుకు వచ్చే దారిలోనే ఉన్నారు. నేను కూడా నిన్న ఇక్కడ లేను. ఇవాళే రిసార్టుకు వచ్చాను. వాళ్లు కూడా త్వరలోనే ఇక్కడికి వచ్చి మాతో కలుస్తారు...’’ అని పేర్కొన్నారు.
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకీ కొద్ది దూరంలో నిలిచినప్పటికీ... ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకే గవర్నర్ వాజుభాయ్ వాలా మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లోగా బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో... తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు జాగ్రత్త పడుతున్నాయి. ఎమ్మెల్యేలు బీజేపీకి చిక్కకుండా రిసార్టులకు తరలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

loader