తెలంగాణ కు 15టిఎంసిల నీళ్లొదలాని చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్నాటక
తెలంగాణా తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేసే అంశంపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి కోసం 15 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ కు మంగళవారం నాడు మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.ఈ లేఖను నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఎస్.సునీల్ బుధవారం బెంగుళూరులో మంత్రి పాటిల్ ను కలిసి అందజేశారు.దీనిపై కర్ణాటక మంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే కర్ణాటక కు చెందిన కృష్ణా భాగ్య జల నిగమ్ ఎం.డి తో చర్చించాలని సి.ఈ. సునీల్ కు అక్కడి ఇరిగేషన్ మంత్రి పాటిల్ సూచించారు. కోద్దిసేపట్లో చర్చలు జరగనున్నాయి.
ఇదే ఆ లేఖ

