హిందువు అయ్యి ఉండి.. ముస్లింని పెళ్లిచేసుకుంటావా సిగ్గులేదా..?

First Published 16, Apr 2018, 11:20 AM IST
Kareena Kapoor Trolled For Her #JusticeForOurChild Picture, Swara Bhasker Comes To Her Rescue
Highlights
కరీనాపై నెటిజన్ విమర్శలు.. దుమ్ముదులిపిన మరోనటి

‘ ఒక హిందువు అయ్యి ఉండి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా..?  ’ అంటూ ఓ నెటిజన్ బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై విమర్శలు గుప్పించాడు. ఆ విమర్శలను గమనించిన మరోనటి.. కరీనాకి మద్దతుగా నిలవడంతోపాటు.. ఆ వ్యక్తి పై విరుచుకుపడింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... తాజాగా కరీనా కథువా ఘటనపై స్పందిస్తూ ఫ్లకార్డు పట్టుకున్న ఫోటోను మరో బాలీవుడ్ నటి  స్వర భాస్కర్‌ తన ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.  

ఆ ఫోటోకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. కరీనాపై దారుణంగా కామెంట్ చేశాడు.‘హిందువు అయి ఉండి ఓ ముస్లింను వివాహం చేసుకున్నావ్‌.  పైగా అతనితో కాపురం చేసి ఓ కొడుకు కన్నావ్‌. మళ్లీ అతని తైమూర్ అనే రాక్షస రాజు పేరు పెట్టుకున్నావ్‌. సిగ్గు లేదా?’ అని కామెంట్‌ చేశాడు. దీనికి స్వర భాస్కర్ అంతే ఘాటు బదులిచ్చింది. ‘నీ బతుక్కి నువ్వు సిగ్గుపడాలి. దేవుడు నీకు బుర్ర ఇస్తే దానిని కల్మషంతో నింపావు. భారతీయునిగా, హిందువుగా పుట్టి ఇలా మాట్లాడటం  సిగ్గుచేటు. బహిర్గతంగా ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడటం సమంజసమేనా?’ అని ఆమె రీ ట్వీట్‌ చేశారు. మరికొందరికి కూడా ఆమె దాదాపు ఇలాంటి సమాధానాలే ఇచ్చారు.

loader