కరీంనగర్ జిల్లాలో బోల్తాపడిన ఆర్టీసి బస్సు

కరీంనగర్ జిల్లాలో బోల్తాపడిన ఆర్టీసి బస్సు

ఆర్టీసి బస్సు బోల్తాపడి 40 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దపల్లి  జిల్లాలోని ఎలిగేడు మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సండబందించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాసాపూర్‌ వెంకట్రావుపూర్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తొంది. బస్సు ప్రచయాణికులతో కిక్కిరిసి ఉంది. అయితే ఈ బస్సు ఎలిగేడు-సుల్తాన్‌పూర్‌ గ్రామాల ప్రయాణిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు వాపోతున్నారు.  

ప్రమాద సమయంలో బస్సులో  60 మంది ప్రయాణికులు ఉండగా వారిలో వారిలో చాలామంది సురక్ష్ితంగా ఉన్నారు. ఓ 10 మంది అతి తీవ్రంగా గాయాలవగా, మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక తహశీల్దార్ తెలిపారు.   పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సంఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos