ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ కార్బన్.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ‘ టైటానియం జంబో2’ పేరిట ఈ స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ అసలు ధర రూ.5,999కాగా.. వినియోగదారులకు రూ.3,999కే లభిస్తోంది. కాకపోతే.. ఫోన్ కొనుగోలుచేసిన వారు 36 నెలల పాటు నెలకు రూ.169 ఆపైన విలువ గల ప్లాన్‌ను ఎయిర్‌టెల్ సిమ్‌లో వాడాలి. దీంతో 18 నెలలకు రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది. మరో 18 నెలలు ఇలాగే వాడితే మరో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో మొత్తం 36 నెలల తరువాత రూ.2వేల క్యాష్ బ్యాక్ వచ్చినట్టు అవుతుంది. ఈ క్రమంలో ఫోన్ ధర రూ.3,999 అవుతుంది. 

కార్బన్ టైటానియం జంబో2 ఫోన్ ఫీచర్లు..

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.