Asianet News TeluguAsianet News Telugu

రిజర్వేషన్ తీర్మానం చంద్రబాబు సరికొత్త మోసం

కాపులను బిసి ఎఫ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన అసెంబ్లీ తీర్మాన్ని చాలా మంది కాపు నేతలు మోసం అంటున్నారు

kapus are skeptical about Naidu quota resolution in AP Assembly

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాపు బిసి స్టేటస్ అసెంబ్లీ తీర్మానం మీద కాపులలో పెద్ద పెద్ద విశ్వాసం పెంచలేదు. చాలా మంది ఇది డ్రామాగానే భావిస్తున్నారు. ఈ చర్య మీద సోషల్ మీడియా కాపు యువకులు, మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిజాయితీ శంకిస్తున్నారు. పలు కాపు గ్రూపులలో వచ్చిన కొన్ని ఆసక్తి కరమని అభిప్రాయాలు.

 

ఇల్లు అలకగానే పండుగ కాదని కాపు యువనేత సాయిబాబ నాయుడు వ్యాఖ్యానించారు. ‘ఇది మరో నాటకం.... నివేదిక పూర్తి రిపోర్ట్ రాకుండానే, అసెంబ్లీ తీర్మానం కాకుండానే(ఇపుడయింది), రాష్ట్రపతి అమోదం లేకుండానే, దీనిని రాజ్యాంగం 9 షెడ్యూల్లో చేర్చకుండానే, కాపులకు రిజర్వేషన్ కలిపించినట్లుగా ప్రకటన చేయటం, కాపులను నిలువునా మరలా మోసం చేయటమే. కాదా?’ అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో కాపు రిజర్వేషన్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాడని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
 

‘50% రిజర్వేషన్లు దాటితే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదించాలి.

చంద్రబాబు ఇవ్వాలనుకుంటే ఇప్పుడున్న బిసిల కోటాలోనే కాపులనూ కలిపి ఉంటే పార్లమెంటు తీర్మానంతో పని ఉండేదికాదు,’ అని అశ్విన్ పోతుల అభిప్రాయపడ్డారు.

‘ కాపుల ప్రత్యేక కోటా BC(F) అనే పేరుతో 5% అదనంగా కలిపితే ఇప్పటికే ఉన్న 50%+5%=55% అవుతోంది.
కాబట్టి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.ఎలాగూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించడానికి ఒప్పుకోదు...మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రం ఆమోదించడం లేదు. నేనేమి చేస్తానని చెబుతాడు,’ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
భాజపా కోర్టులోకి నెట్టేసే ప్రయత్నం అని అన్నారు.

పోలవరం ఇష్యూని కాపు రిజర్వేషన్ల తీర్మానంతో మాయం చేసేశాడని కాపుమేధావి ఒకరు వ్యాఖ్యానించారు.

  ‘చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఆనందపడటం ఎంతవరకు సమంజసం,’సునీల్ నిశ్శంకరావు సునీల్ చంద్రబాబు నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్న వారిని ప్రశ్నించారు.

‘రిజర్వేషన్లు వస్తాయే లేదోగాని పోలవరంపై జరుగుతున్న రాజకీయ క్రీడను దారి మరల్చటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద కాపుల రిజర్వేషన్లు అంశాన్ని వెలుగులో కి తీసుకువచ్చింది.ఈ దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది,’అని ఆయన హెచ్చరిక చేశారు. కేంద్రం కోర్టు లోకి కాపు రిజర్వషన్లను తోసేయాలనుకోవడం  ఒక కొత్త మోసమని హెమంత్ కొమ్మా ఒక  కాపునాడు గ్రూప్ లో పోస్ట్ పెట్టారు.  కేంద్ర ప్రభుత్వం లో టిడిపి ఉందికాబట్టి పార్లమెంట్ లో బిల్లును పెట్టి టిడిపి నెగ్గించి తీరాలని అన్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios