చర్చనీయాంశంగా మారిన కనిగిరి ఎమ్మెల్యే  ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే అభివృద్ధి గురించి నిలదీస్తే.. తిక్క సమాధానాలు చెప్పిన ఎమ్మల్యే

సాధారణ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఈ సమయంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా.. ప్రజలను ఎలా మచ్చిక చేసుకుందామా..? ప్రజలను ఎలా ఆకర్షించి వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుద్దామా అని ఆలోచిస్తాడు. గతంలో అభివృద్ధి చేయకపోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కచ్చితంగా అభివృద్ధి చేస్తానంటూ హామీలు కూడా ఇచ్చేస్తుంటారు. కానీ.. కనిగిరి ఎమ్మెల్యే మాత్రం.. సీన్ రివర్స్ చేశాడు. ఎమ్మెల్యే ఏమిటి ఇలా మాట్లాడాడు అని సొంతపార్టీ నేతలే తలలు బాదుకుంటున్నారు.

విషయం ఏమిటంటే.. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు సోమవారం.. తన నియోజకవర్గంలో ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఆ సమయంలో.. తమకు రోడ్ల్లు సరిగా లేవు.. ఎప్పుడు వేయిస్తారంటూ స్థానికులు ఆయనను ప్రశ్నించారు. సాధారణంగా ఆ స్థానంలో ఎవరు ఉన్నా.. త్వరలో వేయిస్తామనో.. లేదా ఇంకేదైనా కారణమో చెబుతారు. కానీ బాబురావు మాత్రం.. రోడ్లు ఎందుకు వేయాలి అని ప్రజలనే ఎదురు ప్రశ్నించాడు. ‘‘రూ.10కోట్లు, రూ.15కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేస్తేయ మీరేమైనా ఓట్లు వేస్తున్నారా’’ అంటూ అడిగారు. దానికి అక్కడి ప్రజలు సమాధానంగా ‘‘తాము ఓట్లు వేయలేదని మీరేలా చెబుతారంటూ’’ మంత్రిని నిలదీశారు. అయినప్పటికీ.. ‘‘మీరంతా ఓట్లు వేయలేదని నాకు తెలుసంటూ’’ మంత్రి బుకాయించాడు. ఈ ఘటనంతటినీ స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే మాటలు మీరు కూడా ఒకసారి వినండి

.