కుటుంబంతో సహా రైలు కింద పడి హోంగార్డు ఆత్మహత్య

First Published 13, Jan 2018, 6:22 PM IST
kammam homeguard suicide
Highlights
  • ఖమ్మం పట్టణంలో దారుణం
  • రైలు కింద పడి ఓ హోంగార్డు కుటుంబం ఆత్మహత్య

 ఖమ్మం పట్టణంలో దారుణం జరిగింది. రైలు కింద పడి  తండ్రీ, ఇద్దరు కొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన పట్టణంలోని వెంకటగిరి రైల్వే గేటు వద్ద జరిగింది. 

జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం యూనిట్‌లో కె. విశ్వనాథ్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ బాధలు తట్టుకోలేక ఇవాళ ఉదయం తన కుమారులిద్దరితో కలసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగాఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, అయితే ఇది కాకుండా ఈ ఆత్మహత్యలకు మరేదైనా కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జీఆర్పీ ఎస్సై రవికుమార్‌ వెల్లడించారు.
 

loader