ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఖతౌలి వద్ద కళింగ-ఉత్కల్‌ ఎక్స్ ప్రెస్‌ కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
ఉత్తర్ ప్రదేశ్లోని ముజఫర్నగర్ ఖతౌలి వద్ద కళింగ-ఉత్కల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన అరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సాయంకాలం 5.50 కి జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకూ పదిమంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయపడ్డారు. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయని ధృవీకరిస్తూ ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు. అయితే తర్వాత 14 బోగీలు పట్టాలు తప్పాయని కొన్ని చానెళ్లు చెబుతున్నాయి.
చనిపోయిన వారి కుటుంబాలకు రు. 3.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేలు,స్వల్ప గాయాల ప్రయాణికులకు రు. 25వేలు ఇస్తారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రు. 50 వేలను యుపి అందిస్తుంది.
సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఉత్తర ప్రదేశ్ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ చెప్పారు. నేషనల్ డిశాస్టర్ మేనేజ్ మెంట్ అధారిటీ అధికారులు మృతులు పదకొండు అని చెబుతున్నా ఇది బాగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చీకటి పడుతూ ఉండటంతో సహాయక చర్యు లు కష్టమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరొక వైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
సహాయక చర్యు పర్యవేక్షిస్తున్న సురేశ్ ప్రభు
ప్రధాని దిగ్భ్రాంతి
