Asianet News TeluguAsianet News Telugu

పార్టీ ఫిరాయించిన జ్యోతుల నెహ్రూకు బాబు బహుమానం?

వైసిసి వదలి తెలుగుదేశంలోకి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ మొత్తానికి ప్రతిఫలం ముడుతూ ఉంది.పార్టీ దూకినందుకు ఆయనకు ఆశించి మంత్రి పదవి రాలేదు. దీనికి ప్రతిఫలంగా కుమారుడు నవీన్ ని తూగో జిల్లా పరిషత్ ఛెయిర్మన్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం సిటింగ్ ఛెయిర్మన్ రాంబాబు చేత రాజీనామా చేయించారు.

jyothula Nehru to get compensation for defecting to TDP from YCP

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఫిరాయింపుఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు  తృణమో పణమో దక్కనుంది. తెలుగు దేశం వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆయన కొడుకు జ్యోతుల నవీన్ కు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిఇచ్చేందుకు రంగం సిద్ధమవుతూ ఉంది. నవీన్ జగ్గంపేట జడ్ పిటిసి సభ్యుడు. వారం పది రోజులలో కుమారుడి పట్టాభిషేకం  చూసి పార్టీ మారిన నెహ్రూ సంతోషిస్తారు.

 

2014లో వైసిసి తరఫున గెల్చిన జ్యోతుల నెహ్రూ ఫిరాయించి టిడిపి లో చేరాడు. ఆయనకు మంత్రి పదవి ఆశచూపాడని, కాపులను దారికి తెచ్చే బాధ్యతను ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు  అప్పచెప్పాడని అంతా అనుకున్నారు. ఇవేవీ జరగలేదు. దీనితో నెహ్రూ నిరుత్సాహపడ్డారని, చంద్రబాబు  హామీలు విని వైసిసి వదిలినందుకు చింతిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి.  ఇది విన్న చంద్రబాబు నాయుడు మంత్రిపదవి కి బదులు  జిల్లా పరిషత్ ఛెయిర్మన్ పదవిని నవీన్ కు ఇస్తానని  హామీ ఇచ్చారని చెబుతున్నారు. అప్పటినుంచి జిల్లా పరిషత్ ఛెయిర్మన్ పదవి ఖాళీ చేయించే పనిలో బాబు మునిగిపోయారు.

 

ఇలాంటపుడు  ఆదివారం నాడు తూగో జిల్లా పరిషత్ ఛెయిర్మన్ రామన రాంబాబు(కాపు), వైస్ ఛెయిర్మన్ పెండ్యాల నళినీకాంత్ (కమ్మ)  పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసేందుకు రాంబాబు గత కొద్ది రోజులు మొండికేస్తున్నారు.కాకినాడలో కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాంబాబు పదవి చేపట్టి మూడేళ్లయింది.అయితే ఈ మధ్య ఆయన మీద రాజీనామా చేయాలని తీవ్ర వత్తిడి మొదలయింది. ఇదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు(ఇద్దరు కాపులే) పార్టీ అవసరాల రీత్యా రాజీనామా చేయాలని రాంబాబు బతిమాలారు. రాంబాబు ‘కదురుపోండి’ అన్నాడు. దీనితో ఆగ్రహించిన చంద్రబాబు నాయు మొన్న విశాఖ మహానాడులో జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా స్వయంగా హెచ్చరించారు. దీని ఫలితమే నిన్నటి రాజీనామా. అయితే, అయనను సంతృప్తి పరించేందుకు జిల్లా టిడిపి అధ్యక్ష పదవి ఇచ్చారు.

 

మరి పెండ్యాల నళినీకాంత్  వైస్ ఛెయిర్మన్ పదవికి ఎందుకు రాజీనామా చేశారు?

 

 ఇది కూడా జ్యోతుల నెహ్రూ కోసమేనని టాక్. ఎలాగంటే, ఛెయిర్మన్ గా రాంబాబు దిగిపోతే, వైస్ ఛెయిర్మన్ (కమ్మ)ని ఛెయిర్మన్ చేయాలని కమ్మ వారిని నుంచి వత్తడి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు నళినీకాంత్ ను కూడా రాజీనామాచేయించి జ్యోతుల నెహ్రూ కుమారుడికి ఇచ్చిన హామీ అమలు చేసేందుకు బాబు బాట వేశారని జిల్లాలో అనుకుంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios