సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జూ. ఎన్టీయార్ కొత్త పార్టీ
తాత బాటలోనే మనవడు నడుస్తున్నాడు. సీనియర్ ఎన్టీయార్ వెండితెరపై రాణించి రాజకీయాల్లో అధికారం చేపట్టి తెలుగునాట తనకంటూ ఓ చిరస్థాయి గుర్తింపును సృష్టించుకున్నారు.
ఆయన బాటలోనే వెండితెరపై వెలిగిపోతున్న జూనియర్ ఎన్టీయార్ కూడా త్వరలో తాతలాగే రాజకీయ పార్టీ పెడుతున్నారు. కాదు.. కాదు... పెట్టేశారు. ఏప్రిల్ 11నే పార్టీ పేరు బయటకొచ్చింది. ఇంతకీ పార్టీ పేరు ఏంటో తెలుసా..?
నవ భారత్ నేషనల్ పార్టీ... దీనికి జూ.ఎన్టీయార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు. మరి, తెలంగాణ శాఖ కు ఎవరు అధ్యక్షులు... ?ఇంతకీ ఈ పార్టీ కి రూపకర్త ఎవరు... ? ఏపీ పార్టీకి ఎన్టీయార్ అధ్యక్షుడైతే పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు...? పార్టీ విధివిధానాలు ఏంటీ.... ? వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు... ? దీనికి జూ. ఎన్టీయార్ తండ్రి హరికృష్ణ మద్దతు ఉందా... ? ఇలాంటి సవాలక్ష సందేహాలు వస్తున్నాయా...? వాటికి సమాధానం మాత్రం తెలియదు.
అసలు ఈ పార్టీ గురించి జూ. ఎన్టీయార్ కే తెలియదు. అంతా సోషల్ మీడియా మహిమ. గత కొన్ని రోజులుగా ఈ వార్తే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే 2012లోనే ఈ పేరుతో ఓ పార్టీ రిజస్టర్ అయినట్లు తెలిసింది.
