జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిక్కడే  మృతి చెందాడు. మరో నలుగురు విద్యార్థులు  తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని కాచీగూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కూడా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే  మణికొండలో కొందరు యువకులు గెట్ టూ గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి విశ్వజిత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పార్టీ ముగిసాక తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వజిత్ అక్కడికక్కడు మృతి చెందగా మిగతా వారు గాయాలపాలయ్యారు.

అయితే ఈ ప్రమాద సమయంలో యువకులు మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.