మీరు రిలయన్స్ జియో మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారా..? అయితే ఇది మీకు నిజంగా శుభవార్తే. జియో ఫోన్ యూజర్స్ కి డేటా లిమిట్ ని కంపెనీ పెంచింది. జియో అందిస్తున్న రూ.153 ప్లాన్ ని  అప్ గ్రేడ్ చేసింది. అంటే.. ఈ రూ.153 ప్లాన్ ని వినియోగిస్తున్న జియో ఫోన్ యూజర్లకు ప్రతి రోజు 4జీ స్పీడ్ గల 1జీబీ డేటాని వినియోగించుకోగలరు. అంతేకాదు.. అపరిమిత వాయిస్‌ కాల్స్‌(లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనున్నట్లు తెలిపింది. గతంలో రూ.153 ప్లాన్ లో రోజుకి 500ఎంబీ డేటా మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది కాక జియో ఫోన్‌ యూజర్లకు అదనంగా మరో రెండు శాచెట్‌ ప్యాక్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒకటి రూ.24 ప్యాక్‌. దీని కింద రోజుకు 500 ఎంబీ హై స్పీడ్‌ డేటా, 20 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్‌ యాక్సస్‌ను రెండు రోజుల పాటు లభిస్తాయి. రెండోది రూ.54 ప్యాక్‌. దీని కింద ఏడు రోజుల 500ఎంబీ హై స్పీడ్ డేటా , 70 ఎస్ఎంఎస్ లను ఆఫర్‌ చేస్తుంది.