జియో కస్టమర్లకు.. రిలయన్స్ జియో సంస్థ శుభవార్త ప్రకటించింది. ఇప్పటి వరకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లను ఖుష్ చేసిన జియో.. మరో క్యాష్ బ్యాక్ ఆఫర్ కి తెరలేపింది.  గతంలో జియో రీఛార్జ్ చేసుకున్న కష్టమర్లకు రూ.799 క్యాష్ బ్యాక్ అందజేసేది. అయితే..  ఈ ఆఫర్ ఫిబ్రవరి 15తో ముగిసింది.

 

ఇదిలా ఉండగా.. రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో తోపాటు.. తాజాగా విడుదలైన కొన్ని స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ.. రూ.2,200 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. ఈ ప్రకటనతో చాలా మంది ఖుష్ అయ్యారు. అయితే.. ఫోన్ కొనుగోలు చేయని వారి పరిస్థితేంటి..? వారికి ఈ ఆఫర్ వర్తించదు కదా అందుకే.. జియో మరో నిర్ణయం తీసుకుంది.

జియో సిమ్ వాడుతున్న ప్రతి కష్టమర్ కి అంటే జియో ప్రైమ్ మెంబర్స్ అందరికీ మరో క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకువచ్చింది. దీని ప్రకారం 398 రూపాయలు, దానికన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్నవారికి గరిష్టంగా 799 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంట్లో 400 రూపాయల వరకూ ఒక్కొక్కటి 50 రూపాయల విలువ కలిగిన 8 ఓచర్లని స్వయంగా జియో అందిస్తుంది. మిగిలినవి మొబిక్విక్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే జియో ఫుల్ పేరిట మీ ఖాతాలోకి జమ అవుతాయి.