జియో మరో బంపర్ ఆఫర్

Jios More Than 100 percent Cashback Offer Extended Till March 15 Details Here
Highlights

  • క్యాష్ బ్యాక్ ఆఫర్ పొడిగించిన జియో

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో... మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో జియో ప్రకటించిన ‘100శాతం పైగా క్యాష్ బ్యాక్’ ఆఫర్ తుది గడువును పొడిగించింది. మార్చి 15 వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద రూ.398 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారికి రూ.700 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ కేవలం జియో ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే. రూ.400 ఓచర్ల రూపంలో లభిస్తాయి. మిగతా 300 రూపాయలను ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే వంటి డిజిటల్‌ వాలెట్ల ద్వారా అందిస్తోంది. మొబిక్విక్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే జియో ప్రైమ్‌ మెంబర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది.

అదే పేటీఎం ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే కొత్త కస్టమర్లకు రూ.80, పాత కస్టమర్లకు రూ.50 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. అమెజాన్‌ పే ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే జియో కొత్త, పాత యూజర్లకు రూ.50 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఫోన్‌పే ద్వారా జియో కొత్త యూజర్లకు రూ.90 క్యాష్‌బ్యాక్‌, పాత యూజర్లకు రూ.60 క్యాష్‌బ్యాక్‌ అందుతోంది. ఫ్రీఛార్జ్‌ నుంచి కొత్త జియో యూజర్లకు రూ.75 క్యాష్‌బ్యాక్‌, పాత యూజర్లకు రూ.30 క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

 

loader