మరో సంచలనం.. జియో నుంచి హోమ్ టీవీ

JioHomeTV to launch soon, will offer HD channels at Rs 400: Report
Highlights

జియో కష్టమర్లకు బంపర్ ఆఫరే

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరో సంచలనానికి తెరలేపుతోంది. జియో త్వరలోనే ‘జియో హోమ్‌ టీవీ’ పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందట. అంతేకాదు, అన్ని ఎస్‌డీ(స్టాండర్డ్‌ డెఫినేషన్‌) ఛానళ్లను నెలకు రూ.200లకే అందించనుందని సమాచారం. ఇక ఎస్‌డీ+హెచ్‌డీ(హై డెఫినేషన్‌) ఛానళ్లు రూ.400కే అందిస్తుందని చెబుతున్నారు. ఇదే జరిగితే డీటీహెచ్‌ రంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఎన్‌హేన్సడ్‌ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్‌ సర్వీస్‌(ఈఎంబీఎంఎస్‌) ఆధారంగా పనిచేస్తుందని సమాచారం.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే సేవలను అందిస్తోందన్న జియో బ్రాడ్‌కాస్ట్ ‌యాప్‌నకు సరికొత్త రూపమే ఈ ‘హోం టీవీ’. ఇటీవల హెచ్‌డీ ఛానళ్లను కూడా పరీక్షించారట. జియో వినియోగదారులందరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు త్వరలోనే జియో నుంచి ల్యాప్ టాప్ లు కూడా రానున్నాయి.
 

loader