ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.999కే జియోఫై జేఎంఆర్815 పేరిట ఓ నూతన 4జీ వైఫై డేటా కార్డ్‌ ను తాజాగా విడుదల చేసింది. దీన్ని యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఈ హాట్‌స్పాట్ డివైస్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు నో ఎక్స్‌ ట్రా కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా  అందిస్తున్నారు.

ఇక యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన బజ్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి దీన్ని కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ హాట్‌స్పాట్ డివైస్ ద్వారా యూజర్లు 150 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్, 50 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్‌ను పొందవచ్చు. ఇక దీని సహాయంతో ఫోన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫోన్‌లో జియో 4జీ వాయిస్ యాప్ ఉండాలి. ఇక ఈ హాట్‌స్పాట్‌కు ఒకేసారి 10 డివైస్‌లను వైఫై ద్వారా కనెక్ట్ చేసి నెట్ సదుపాయం పొందవచ్చు. ఇందులో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 8 గంటల వరకు ఈ డివైస్‌ను నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్‌ను ఫుల్ చార్జింగ్ చేసేందుకు దాదాపుగా మూడున్నర గంటల సమయం పడుతుంది.