అంబానీ ఇంట్లోనే నెట్ సరిగా రాలేదట

First Published 17, Mar 2018, 11:00 AM IST
Jio was first seeded by Isha Ambani in 2011 reveals dad Mukesh
Highlights
  • జియో అంకురార్పణకు వెనక ఉన్న అసలు కథను వివరించిన ముఖేష్ అంబానీ

టెలికాం రంగంలో జియో సంచలనం అంతా ఇంతా కాదు. జియో ఆఫర్లు, ప్లాన్లకు దేశ ప్రజలు ఫిదా అయిపోయారు. ఇక జియో పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే.. అసలు అంబానీకి టెలికాం రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా..? దీని వెనుక ఓ చిన్న పాటి కథే ఉంది. ఆ కథేంటి అంటే..

ఇప్పుడు మనందరం రోజుకి జీబీల కొద్దీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్న మొబైల్ డేటా మొత్తం ఓ చిన్న అసౌకర్యం నుండి పుట్టుకొచ్చింది. 2011లో ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అమెరికాలో చదువుకుంటోంది. సెలవలకు భారత్ వచ్చిన ఆమెకు ఇంట్లో ప్రాజెక్టు వర్క్ చేద్దామనుకుంటే.. నెట్ సరిగా రాలేదు. దీంతో ఆమె చాలా అసౌకర్యానికి గురయ్యారు. అంతే.. ఇదే విషయాన్ని తండ్రికి తెలియజేసింది. వారికి కలిగిన అసౌకర్యానికి పరిష్కారంగా వచ్చిన ఆలోచనే ‘‘జియో’’. ఈ విషయాన్ని అంబానీనే స్వయంగా తెలియజేశారు.

‘‘ఈశా, ఆకాశ్‌లు భారత యువ తరానికి చెందినవారు. చాలా సృజన ఉన్న వాళ్లు. విజయకాంక్ష ఉన్నోళ్లు. ప్రపంచంలో అత్యుత్తమంగా ఉండడానికి ఆతృతగా ఉన్న వాళ్లు. ఈ యువ భారతీయులు నన్ను బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ గురించి చెప్పి ఒప్పించారు. భారత్‌ సాంకేతికత విషయంలో వెనకబడి ఉండకూడదన్నారు. ఆ సమయంలో భారత్‌లో నెట్‌ అనుసంధానం చాలా తక్కువగా ఉండేది. డేటా కొరత ఉండడమే కాదు.. దాని ధర చాలా ఎక్కువగా ఉండేది. చాలామంది భారతీయులకు అది అందనంత ఎత్తులో ఉండేది. కానీ.. జియో వచ్చాక దేశంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. సెప్టెంబరు 2016లో జియోను ప్రారంభించాం. ఇప్పటికే అది భారత్‌లో ఓ గొప్ప మార్పుగా అవతరించింది. అమెరికా 1జీ మొబైల్‌ నెట్‌వర్క్‌, ఐరోపా 2జీ, చైనా 3జీతో ముందడుగు వేయగా.. జియో ప్రపంచంలోనే అతిపెద్ద 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌గా మారింది.’’ అని ముఖేష్ అంబానీ అన్నారు.

loader