Asianet News TeluguAsianet News Telugu

జియో షాక్ ‘కాల్’

రూ. 99 తో రిచార్జ్ చేయించి ఏడాదంతా ఉచిత కాల్స్ మాట్లడుకోవచ్చని భావిస్తున్నారికి జియో షాక్ ఇచ్చింది.

jio Terms and conditions to keep in mind

అంతా ఫ్రీ అంటూ 10 కోట్లకు పైగా ఖాతాదారులను తన వైపు తిప్పుకొని రికార్డులు సృష్టించిన రిలయన్స్ జియో పోటీ టెలికాం సంస్థలును చావు దెబ్బతీసింది.

 

అయితే మార్చి 31 లో జియో ఫ్రీ ఆఫర్లన్నీ ఆపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైమ్ మెంబర్‌షిప్‌ పేరుతో జియో అన్ని టెలికాం సంస్థలులాగే రిచార్జ్ ను ప్రవేశపెట్టింది.

 

ఒక్కసారి 99 తో రిచార్జ్ చేసి ఏడాదంతా ఉచితంగా కాల్స్ మాట్లాడుకోవచ్చని, డేటా ఉపయోగించాలంటే మాత్రం దీనికి అదనంగా రిచార్జ్ చేయించుకోవాలని తెలిపింది.

 

కానీ, 99 రూపాయలు చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఫ్రీ ఆఫర్ ఏం వర్తించదని ఇప్పుడు జియోనే చెబుతోంది.

 

99 రూపాయలతో రీచార్జ్ చేయించింది ఏడాది పాటు అదనపు లాభాలు పొందడానికి మాత్రమేనని స్పష్టం చేసింది.

 

జియో ప్రైమ్ యూజర్లు కూడా ఏదో ఒక ప్యాక్‌ను రీచార్జ్ చేయించుకోవాలని జియో యాజమాన్యం అధికారిక వెబ్‌సైట్లో తెలిపింది.

 

లేకపోతే జియో సేవలు నిలిపివేస్తామని సూచించింది. రీచార్జ్ చేయించకపోతే కాల్స్ చేయడానికి అనర్హులని తేల్చేసింది.

 

అంతేకాదు మూడు నెలల్లోపు ఏదో ఒక ప్యాక్‌తో రీచార్జ్ చేయించకపోతే సర్వీస్ పూర్తిగా నిలిపివేస్తామని ష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios