జియో మరో బంపర్ ఆఫర్..‘‘ట్రిపుల్ క్యాష్ బ్యాక్’’

jio surprize triple cash back offer to give benfits rs3300
Highlights

  • రూ.399 లేదా ఆపై అన్ని రీఛార్జ్‌లపై  రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది.

ప్రముఖ టెలికాం కంపెనీ జియో.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూఇయర్ కానుక పేరుతో రెండు రోజుల క్రితమే.. రెండు ఆఫర్లను ప్రకటించిన జియో.. తాజాగా.. మరో ఆఫర్ ప్రకటించింది. ‘ సర్ ప్రైజ్ క్యాష్ బ్యాక్’ పేరిట కస్లమర్లకు క్యాష్ ఆఫర్ ని ఇస్తున్నట్లు తెలిపింది. రూ.399 లేదా ఆపై అన్ని రీఛార్జ్‌లపై  రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వచ్చే ఏడాది జనవరి 15 వరకు రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ సర్‌ప్రైజ్‌ క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. రూ.399 రీఛార్జ్‌పై జియో అందిస్తున్న రూ.2599 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌కు నిన్నటితోనే గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌తో కస్లమర్లను సర్ ఫ్రైజ్ చేసింది.

''రూ.399, అంతకన్నా ఎక్కువ రీఛార్జ్‌ చేసుకున్న వారికి రూ.3,300 వరకు జియో సర్‌ప్రైజ్‌ క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.400 మై జియో క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, వ్యాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, ఈ-కామర్స్‌ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్‌ ఓచర్ల రూపంలో ఆఫర్‌ చేస్తుంది'' అని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2017 డిసెంబర్‌ 26 నుంచి 2018 జనవరి 15 వరకు మధ్యలో చేయించుకున్న అన్ని రీఛార్జ్‌ లకు ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉండనుందని పేర్కొన్నాయి.  

loader