ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరోసారి ఆఫర్లు ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా మరోసారి ప్లాన్లను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు.. కొత్త ప్లాన్లను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పింది. రూ.98తో రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ తో 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందజేయనున్నట్లు చెప్పింది. ఈ ప్లాన్ ని జియో.. తాజాగా ప్రవేశపెట్టింది.

ఇక అప్ గ్రేడ్ చేసిన ప్లాన్ల విషయానికి వస్తే.. రూ. 149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లపై 42జీబీ, 105జీబీ, 126జీబీ, 136జీబీ డేటాను... 28 రోజులు, 70 రోజులు, 84 రోజులు, 91 రోజులు  అందిస్తోంది. ఈ ప్యాక్‌లపై అంతకముందు రోజుకు 1జీబీ డేటానే ఉండేది. ప్రస్తుతం 1.5జీబీ డేటాను జియో ఆఫర్‌ చేస్తోంది. అంతేకాక 1.5జీబీ డేటా ప్యాక్‌లైన రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌లపై రోజుకు 2జీబీ చొప్పున 56జీబీ, 140జీబీ, 168జీబీ, 182జీబీ డేటా అందిస్తోంది. రిపబ్లిక్‌ డే నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.  అంటే మొత్తంగా సమీక్షించిన అన్ని ప్యాక్‌లపై 50 శాతం ఎక్కువ డేటా లభించనుంది.