రెండు కొత్త ప్లాన్ లను ప్రవేశపెట్టిన జియో

రిలయెన్స్ జియో... దేశ టెలికాం రంగంలోనే ఓ సంచలనంగా మారింది. అన్ లిమిటెడ్ ఫ్రీ టాక్ టైం, ఫ్రీ డేటాతో పోటీ టెలికాం దారుల అడ్రస్ లేకుండా చేస్తోంది.

లాంచింగ్ ఆఫర్ ఆ తర్వాత న్యూ ఈయర్ ఆఫర్ తో కోటి మందికి పైగా వినియోగదారులను సొంతం చేసుకుంది.

మార్చ్ తో జియో ఆఫర్ ముగిసిపోతున్న నేపథ్యంలో తన వినియోగదారులను నిలుపుకునేందుకు జియో మరో రెండు ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది.

అందులో ఒక ఆఫర్ రూ.149తో రీఛార్జ్‌. ఇలా రీచార్జ్ చేసుకున్న వారికి నెలరోజుల పాటు ఫ్రీ వాయిస్‌ కాలింగ్‌, 2 జీబీ మొబైల్‌ డేటాను అందించనుంది.

అదే రూ.499 చెల్లించే వారికి నెల మొత్తం ఫ్రీ వాయిస్‌ కాలింగ్‌తో పాటు రోజుకు 2 జీబీ చొప్పున నెల మొత్తానికి 60 జీబీ 4 జీ డేటా అందించనుంది.

ప్రైమ్‌ ప్లాన్‌లో చేరాలంటే మార్చ్ 31 చివరి తేదీ. అయితే ఈ ప్లాన్ లో చేరని వారికి ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ విధానాలు అన్ని టెలికాం సంస్థల మాదిరిగా నే ఉంటాయి.