Asianet News TeluguAsianet News Telugu

ఇంకొన్నాళ్లు జియో ఆఫర్ కొనసాగింపు

ఏప్రిల్ 30 వరకు పొడగించే అవకాశం

jio prime membership may be extended to april

రిలయన్స్ జియో... భారత్ టెలికాం రంగంలోనే ఓ పెను సంచలనం..ఫ్రీ గా 4  జీ ఇంటర్ నెట్, అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్ తో పోటీ టెలికాం సంస్థలకు దడ పుట్టించింది. మూడు నెలల్లోనే 10 కోట్లకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది.

 

ముందుగా లాంచింగ్ ఆఫర్ తో ఆ తర్వాత హ్యాపీ న్యూయర్ ఆఫర్ తో దాదాపు 6 నెలలు తన వినియోగదారులకు ఉచితంగా అన్ లిమిటెడ్ వాయిస్ మరియు  డేటా ను  అందించింది. అటు తర్వాత ఇప్పుడు అన్ని టెలికాం సంస్థలు మాదిరిగానే టారీఫ్ ను ప్రవేశ పెట్టింది.

 

రూ.99 తో ప్రైమ్ మెంబర్ షిప్ ను తీసుకొచ్చింది. ఈ ప్రైమ్ మెంబర్ షిప్ ను తీసుకుంటేనే తమ కస్టమర్లు జియో సేవలను వాడుకునే అవకాశం ఉండేలా షరతు పెట్టింది.

 

ప్రైమ్ మెంబర్ షిప్ లు చేరడానికి గడువును మార్చి 31 గా విధించింది. అయితే  వినియోగదారుల నుంచి సూచనలు రావడంతో ఈ గడువుపై జియో పునరాలోచించింది. గడువును ఏప్రిల్ 30 వరకు పొడగించే విషయంపై ఆలోచన చేస్తోంది.

 

ఇప్పటి వరకు అధికారంగా జియో వినియోగదారుల సంఖ్య 10 కోట్లు గా ఉంది. ప్రైమ్ మెంబర్ షిప్ లో మాత్రం ఈ సంఖ్య 5 కోట్ల కు కూడా చేరలేదని సమాచారం. అందుకే ఈ ప్రైమ్ మెంబర్ షిప్ గడువు పెంచేందుకే జియో మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

అయితే దీనిపై రిలయన్స్ నుంచి అధికారంగా ఏలాంటి ప్రకటన వెలువడలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios