ప్రముఖ టెలికాం సంస్థ జియో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అన్ని టెలికాం సంస్థల కన్నా ఎక్కువ ఆఫర్లు ప్రకటిస్తూ.. జియో ముందుకు సాగిపోతోంది. కాగా.. తాజాగా.. జియో ప్లాన్లలపై కూడా ధరలు తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు రోజుకి 1జీబీ డేటా అందించే జియో.. ఇప్పుడు రోజుకి 1.5జీబీ అందించనుంది. ఈ మార్పులు.. జనవరి 9వ తేదీ నుంచి అమలు కానున్నాయి.

ప్రస్తుతం రూ.199(28 రోజులు) ,రూ.399(70 రోజులు) ,రూ.459(84 రోజులు), రూ.499(91రోజులు) ప్లాన్లలను అందిస్తోంది. కాగా.. ఇప్పుడు ఈ పాన్ల ధరలను రూ.50 నుంచి రూ.60 వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది.  అంటే రూ.199 ప్లాన్ రూ.159కి,రూ.399 ప్లాన్.. రూ.349కి, రూ.459 ప్లాన్ .. రూ.399కి, రూ.499 ప్లాన్.. రూ.449కే లభించనున్నాయి.  అదేవిధంగా రూ.198,రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లకు ప్రతి రోజూ 1జీబీ డేటాకి బదులు 1.5జీబీ డేటా  అందించనుంది.