జియో ఫోన్ బుకింగ్స్ నిలిపివేత..

Jio Phone Bookings Paused After Millions Pre Book a Unit
Highlights

  • జియో ఫోన్స్ ప్రీ బుకింగ్స్ కి అనూహ్య స్పందన
  • రూ.500 చెల్లించి చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు.

 

టెలికాం రంగంలో జియో.. ఒక సంచలనం సృష్టించింది. దాని దెబ్బకు ఇతర టెలికాం సంస్థలు విలవిలలాడుతున్నాయి. ఇటీవల రిలయన్స్ కంపెనీ జియో ఫోన్స్ ఆన్ లైన్ బుకింగ్స్ ని ప్రారంభించింది. ఈ బుకింగ్స్ కి అనూహ్య స్పందన లభించింది.

గురువారం సాయంత్రం రిలయన్స్ కంపెనీ జియో ఫోన్ బుక్సింగ్స్ ని ప్రారంభించగా.. మినిలియన్ల మంది ఫోన్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. రూ.500 చెల్లించి చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు.

బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల వరకు ఫోన్ బుక్ చేసుకునేందుకు ఎక్కువ మంది వెబ్ సైట్ ఓపెన్ చేశారు. దీంతో  లోడ్ ఎక్కువై వెబ్ సైట్ క్రాష్ అయ్యింది. దీంతో రిలయన్స్ కంపెనీ నిర్వాహకులు జియో ఫోన్ బుకింగ్స్ ని కొంత సమయం వరకు నిలిపి వేశారు.

వెబ్ సైట్ తిరిగి పునరుద్ధరించిన తరువాత బుకింగ్స్ ప్రారంభిస్తామని వారు చెప్పారు. ఈ విషయాన్ని రిలయన్స్ వెబ్ సైట్ లో మెసేజ్ రూపంలో ఉంచారు.

 

జియో 4జీ ఫోన్ ధర రూ.1500 కాగా.. ప్రీ బుకింగ్ సమయంలో.. రూ.500 చెల్లించి.. మొబైల్ కొనుగోలు చేసే సమయంలో మిగిలిన రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

loader