టెలికాం సంస్థ జియో.. ఎయిర్ టెల్ కి పెద్ద షాక్ ఇచ్చింది.  ఇటీవల జియో.. తన ప్లాన్లపై రూ.50 తగ్గింపు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో.. జియోతో పోటీ పడేందుకు ఎయిర్ టెల్ కూడా ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించింది. కొన్ని ఆఫర్ల వ్యాలిడిటీని పెంచేసింది.  అయితే.. ఈ విషయంలో జియో నుంచి ఎయిర్ టెల్ షాక్ తగిలింది. ఎయిర్ టెల్  ఆఫర్ల వ్యాలిడిటీ పెంచిన మరుసటి రోజే.. జియో కూడా అటువంటే ఆఫరే ప్రకటించింది.

కాకపోతే.. ఎయిర్ టెల్ వ్యాలిడిటీ పెంచగా.. జియో వ్యాలిడిటీ తగ్గించి.. ఎక్కువ డేటా అందించనున్నట్లు ప్రకటించింది. కొత్త రూ.509 ప్లాన్‌పై రోజుకు 3జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది. అంటే మొత్తంగా 84జీబీ డేటాను ఆఫర్‌ చేయబోతుంది. అంతకముందు ఈ ప్యాక్‌పై రోజుకు 2జీబీ డేటాను, 49 రోజుల పాటు అందించింది.

అదేవిధంగా రూ.799 ప్లాన్‌పై రోజుకు 5జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో మొత్తంగా యూజర్లకు 140జీబీ లభ్యం కానుంది. అంతకముందు ఈ ప్యాక్‌పై రోజుకు 3జీబీ డేటాను జియో ఆఫర్‌ చేసింది.