జియో మరో బంపర్ ఆఫర్..

Jio launches mega 102GB pack for Rs 251; brings live show featuring Sunil Grover
Highlights

ఐపీఎల్ అభిమానులకు 102జీబీ డేటా, లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఇళ్లు, కార్లు కూడా

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా రూ.251కే ఓ నూతన ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్  ద్వారా కష్టమర్లకు 102 జీబీ డేటాను అందిస్తున్నది. ఈ ప్లాన్‌ను జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌గా వ్యవహరిస్తుండగా, ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు జియో వీలు కల్పించింది. ఏప్రిల్ 7వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఆ తేదీ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లను జియో కస్టమర్లు ఉచితంగా చూడాలంటే రూ.251 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. అనంతరం మై జియో యాప్‌లో క్రికెట్ లైవ్ ప్రసారాలను వీక్షించవచ్చు. 

జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లు జియో ధన్ ధనా ధన్ లైవ్ కింద క్రికెట్ కామెడీ షోలను కూడా వీక్షింవచ్చు. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి ఈ షోలు ప్రసారమవుతాయి. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ఉంటాయి. వీటిని లైవ్‌లో కూడా వీక్షించవచ్చు. కేవలం జియో కస్టమర్లకు మాత్రమే కాకుండా నాన్ జియో కస్టమర్లకు కూడా ఈ కామెడీ షోలు అందుబాటులో ఉంటాయి.  జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌లో భాగంగా జియో ధన్ ధనా ధన్ అనే మరో ఆఫర్‌ను కూడా అందిస్తున్నది. ఇందులో భాగంగా ప్రేక్షకులు జియో క్రికెట్ ప్లే అనే ఓ మొబైల్ వీడియో గేమ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇందులో విన్ అయ్యే వారికి బంపర్ ఆఫర్ కింద ముంబయిలో ఓ లగ్జరీ ఇంటిని అందిస్తారు. ఇక మరో 25 మందికి కార్లను బహుమతులుగా ఇస్తారు. వీటితోపాటు కోట్ల రూపాయల విలువ చేసే నగదు బహుమతులను కూడా ఈ గేమ్ విన్నర్స్‌కు అందిస్తారు.

loader