ప్రముఖ టెలికాం సంస్థ జియో.. కష్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. జియో ప్రైమ్ మెంబర్స్ అందరికీ ఉచితంగా 10జీబీ మొబైల్ డేటా అందించింది. ఇటీవల స్పెయిన్ లోని బార్సిలోనాలో ‘‘ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’’ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమంలో ..‘‘ బెస్ట్ మొబైల్ వీడియో కంటెంట్’’ విభాగంలో జియో టీవీ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా జియో టీవీ యాప్ వాడుతున్న కష్టమర్లు అందరికీ 10జీబీ మొబైల్ డేటా క్రెడిట్ చేసింది.

ఈ మొబైల్ డేటా మే 27వ తేదీ వరకు మాత్రమే వినియోగించుకోగలరు. మరో విషయం ఏమిటంటే.. ఏప్రిల్ 1వ తేదీకి జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడుపు ముగుస్తుంది. అయితే.. ఆ తర్వాత ప్రైమ్ కొనసాగించడానికి కష్టమర్లు డబ్బు చెల్లించాలా లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే జియో ఈ విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.