ఇతర నెట్‌వర్క్ లు ఆఫర్‌ చేస్తున్న ధరల్లోనే డేటా పథకాలు అందివ్వనున్నట్లు తెలిపారు. అయితే 20 శాతం డేటా అదనంగా అందించనున్నట్లు ప్రకటించారు.

డెటాకే డబ్బులు చెల్లించండి కాల్స్ ఫ్రీ గా మాట్లాడండి అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో దేశంలో ఓ సరికొత్త టెలికాం విప్లవాన్నే సృష్టించింది.

దేశవ్యాప్తంగా 4 జీ సేవలను దాదాపు ఏడాది పాటు ఉచితంగా అందించి పోటీ టెలికాం దారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

మొదట ప్రమోషన్ ఆఫర్, ఆ తర్వాత హ్యాపీ న్యూయర్ ఆఫర్ పేరుతో తన వినియోగదారులకు ఫ్రీ కాల్స్, డేటాను అందించింది. మార్చి వరకు ఈ కొత్త ఆఫర్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఎప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్ అమలు అవుతుంది.

అయితే ఉచిత కాల్స్ సదుపాయం మాత్రం అలాగే ఉంటుంది. కేవలం డాటా కోసమే టారిఫ్ ఆఫర్ ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే టారిఫ్ ప్లాన్ ల వివరాలను జియో అధినేత ముఖేష్ అంబానీ మీడియాకు వెల్లడించారు.

ఇతర నెట్‌వర్క్ లు ఆఫర్‌ చేస్తున్న ధరల్లోనే డేటా పథకాలు అందివ్వనున్నట్లు తెలిపారు. అయితే 20 శాతం డేటా అదనంగా అందించనున్నట్లు ప్రకటించారు.

హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ముగిసిన మార్చి 31 తరువాత కూడా ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ రిజిస్టర్‌ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకూ ఫ్రీగా కాలింగ్‌ సదుపాయం ఉంటుందన్నారు. ఈ వాయిస్‌ కాల్స్‌కు రోమింగ్‌తో సహా ఎలాంటి చార్జీలు ఉండవని స్పష్టం చేశారు.