ట్రక్కును ఢీకొన్న జెట్ ఎయిర్ వేస్ విమానం

ట్రక్కును ఢీకొన్న జెట్ ఎయిర్ వేస్ విమానం

దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత.. పార్కింగ్ చేస్తున్న సమయంలో ట్రక్కును ఢీకొట్టింది.అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని జెట్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.  దుబాయ్‌ నుంచి వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం, ఎయిర్‌పోర్టులోని టర్మినల్‌ 3 వద్ద ల్యాండ్‌ అయింది. 

దానికి కేటాయించిన పార్కింగ్‌ ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజ్‌ శాట్స్‌ సర్వీసు ప్రొవైడర్‌ కేటరింగ్‌ వాహనం అక్కడే ఉండటంతో, ల్యాండ్‌ అవుతున్న ఆ విమానం రెక్కలు ట్రక్కును ఢీకొన్నాయి. అయితే ఈ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page