2019లో జెసి పవన్ అనంతపురం లోక్ సభ స్థానానికి  పోటీ చేస్తారని చెబుతున్నారు 2019 తర్వాత  ఈ ‘కుళ్లిన రాజకీయా’లలో కొనసాగలేనని తండ్రి దివాకర్ రెడ్డి ఎపుడో చెప్పేశారు

జెసి దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమర్ రెడ్డి పబ్లిక్ లో రాజకీయాలెపుడూ మాట్లాడ లేదు. కాకపోతే, అపుడపుడు ఆయన కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. ఎపుడో హెడ్ లైన్ కొట్టలేదు. బహుశా తండ్రి దివాకర్ రెడ్డి, చిన్నాయన ప్రభాకర్ రెడ్డి జోరుగా, హుశారుగా ఉన్నారు కాబట్టి ఆయన్నింకా రాజకీయాల్లోకి చొరబడలేదు. అందుకే ఆయన జిల్లాలో ఉన్న సమస్యలమీద ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు లేదు. వార్తల కెక్కలేదు. అయితే, ఈ మధ్య జెసి దివాకర్ రెడ్డి లోక్ సభకు రాజీనామా చేస్తారని,రాజకీయాలనుంచి తప్పుకుని కొడుకు పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం ఎంపిగా నిలబెడతారని బాగా వినపడుతూఉంది. ఇలాంటపుడు పవన్ కుమార్ రెడ్డి టిడిపి నెంబర్ టు, యువనేత, రాష్ట్ర ఐటి మంత్రి లోకేశ్ నాయుడిని కలుసుకున్నారు. వార్తల కెక్కారు. జిల్లా సమస్యల గురించి మాట్లాడారు. వాటిని తొందరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. పవన్ మొత్తానికి లోకేశ్ కు రాజకీయంగా కూడా దగ్గరవుతున్నారు. ఇది 2019 ఎన్నికల ఎక్స్ ప్రెస్ హైవే వేసుకుంటున్నారని జిల్లాలోచెప్పుకుంటున్నారు.

చిత్రం, దివాకర్ రెడ్డి ఏ సమస్యలతో వచ్చే పార్లమెంటు సమావేశాలపుడు రాజీనామా చేస్తారని మీడియా లో వస్తున్నదో అవే సమస్యలను పవన్ రెడ్డి, లోకేశ్ దృష్టికి తెచ్చారు. తనేంచేయాలనుకుంటున్నది కూడా పవన్ చెప్పారు.

పవన్ రెడ్డి లోకేశ్ దగ్గర ప్రస్తావించిన అంశాలు:

**వరుస కరువులతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను ఆదుకోవాలి.

**అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతిమండలానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి.వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి.

**పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకుని,వారిని కలుపుకుని ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందేలా చూడాలి.

**అలాగే జిల్లా వ్యాప్తంగా నిరుద్యో గ సమస్యను దృష్టిలోపెట్టుకుని త్వరగా జిల్లాలో ఐటికంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.

** జిల్లాకు రావలసి నీటి కేటాయింపులను తర్వగా కేటాయించి రైతులను ఆదుకోవాలి.