లీక్ అయిన ‘అపోలో’ ఈ - మెయిల్ డయాబెటిస్ కు తప్పుడు మెడిసన్ వాడారు గుర్తించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం బర్కాదత్ కు పంపిన ఈమెయిల్ లో వెల్లడి


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై అనుమానాలు ఇంకా వీడటం లేదు.

అమ్మ మృతి పై రోజుకో వదంతి పుట్టుకొస్తోంది. అయితే తాజాగా అమ్మ మరణానికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం బయటకి వచ్చింది.

దాదాపు 73 రోజుల పాటు ఆపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందిన జయలలితకు సంబంధించి అపోలో యాజమాన్యం నుంచి ప్రసిద్ధ జర్నలిస్టు బర్కాదత్ కు వచ్చిన ఈ మెయిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ మెయిల్ లో ఏముంది...

డిసెంబర్ 5వ తేదీతో జయలలిత మృతిపై బర్కాదత్ ఎన్డీటీవీలోని తన సహ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో అమ్మ మృతిపై షాకింగ్ న్యూస్ వెల్లడైంది.

జయలలిత డయాబెటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె అపోలో ఆస్పత్రిలో చేరకముందు డయాబెటిస్ కు సంబంధించి రాంగ్ మెడిసన్ ను ఇచ్చారట.

చికిత్స సమయంలో ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి డాక్టర్లు గుర్తించారు. రాంగ్ మెడిసనే అమ్మ ప్రాణం తీసిందనేది ఆ మెయిల్ సారాంశం.

ఇప్పటి వరకు అమ్మ మృతికి సంబంధించి అనేక వదంతులొచ్చాయి. కానీ, దీన్ని ఆ విధంగా కొట్టిపారేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆపోలో లోని ముఖ్యమైన వ్యక్తి నుంచే ఈ మెయిల్ వెచ్చినట్లు వెల్లడవుతోంది.

అయితే బర్కాదత్ మెయిల్, ట్విటర్ అకౌంట్ హ్యాక్ చేశారని వారే ఇలాంటి మెయిల్ క్రియేట్ చేశారని ఎన్డీటీవీ యాజమాన్యం పేర్కొంటుంది.

ఈ మెయిల్ ఎంతవరకు నిజమో, కాదో ఇప్పిటిరవకు స్పష్టత రాలేదు. కానీ, ఇది నిజమైన దీనిపై విచారణ జరగకపోవచ్చు.

అమ్మ మృతిపై ఎలాంటి విచారణ చేపట్టకూడదని శశికళ ఇప్పిటికే నిర్ణయించేశారట.